విద్యార్థులకు ‘స్వచ్ఛతా హీ సేవ’ పై అవగాహన
ప్రజా పాలనలో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సరోజ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 18 : ప్రజా పాలనలో భాగంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సరోజ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాలల ఆవరణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, సురక్షితమైన తాగునీటిని తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తొలుత గ్రామంలో పాఠశాలల విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా హీ సేవా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

