Building Tilts | తృటిలో తప్పిన పెను ప్రమాదం..పక్కకు ఒరిగిన నాలుగు అంతస్థుల భవనం
Building Tilts | శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో మరో భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడం కలకలం రేపింది.
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ( Sherilingampalli Circle ) సర్కిల్ పరిధిలో మరో భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడం కలకలం రేపింది. గోపన్నపల్లి ఎన్టీఆర్నగర్లోని తాజ్‌నగర్( Tajnagar ) లో సుమారు 45 గజాల స్థలంలో నిర్మించిన జీ ఫ్లస్ 4 అంతస్తుల భవనం ఒకవైపు ఒరిగినట్లు (Building Tilts ) గుర్తించారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న సర్కిల్ అధికారులు అక్కడికి చేరుకుని ఒరిగిన భవనంతో పాటు చుట్టుపక్కల ఇండ్లను ఖాళీ చేయించారు.
భవనంలో ఒక్కో అంతస్తులో రెండు గదుల చొప్పున మొత్తం తొమ్మిది గదులను నిర్మించారు. ఒక్కో గదిలో ముగ్గురి నుంచి ఐదుగురు వరకు నివసిస్తున్నట్లు సమాచారం. భవనం ఒరిగిన సమయంలో ప్రమాదం సంభవించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అంజయ్యనగర్‌లో నిర్మాణ దశలో ఉన్న భవనం కూలి ప్రాణనష్టం జరిగిన ఘటన మరువకముందే ఇదే సర్కిల్ పరిధిలో మరో భవనం ప్రమాదకర స్థితికి చేరడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చిన్న స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు, నిర్మాణ నిబంధనల అమలు, అనుమతుల పరిశీలనపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

