లక్నో: ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఒక కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన డ్రైవర్ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాడు. రోగులను పరీక్షించడంతోపాటు వారికి మందులు రాసి ఇచ్చాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో వైద్యాధికారులు దర్యాప్తు చేపట్టారు. (Doctor’s Driver Examined Patients) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాన్షీరామ్ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (ఈఎంవో) రామ్కేశ్, బుధవారం ఒక కేసు విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయనకు బదులుగా కారు డ్రైవర్ అయిన దేవ్, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాడు. ఓపీడీ గదిలోని డాక్టర్ కుర్చీలో కూర్చొన్న అతడు రోగులును పరీక్షించడంతోపాటు వారికి మందులు రాసి ఇచ్చాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వైద్యాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పియూష్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) హరిదత్ నెమి తెలిపారు.
అలాగే డాక్టర్ రామ్కేశ్ నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. చకేరి పోలీస్ స్టేషన్లో ఆ డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ డ్రైవర్‌ను తొలగించినట్లు ఒక అధికారి పేర్కొన్నారు.
कानपुर : ये वीडियो कांशीराम अस्पताल है, दावा है कि ईएमओ डॉ. रामकेश को किसी काम से बाहर जाना पड़ा तो ड्राइवर को अपनी कुर्सी पर बैठा।
अब ड्राइवर को डॉक्टर साहब की कुर्सी मिल गई तो चलाने लगे OPD। मरीजों को दवा और जांच लिख रहे है। जो दवाई उपलब्ध नहीं है उसको भा बता रहे है कि कहा… pic.twitter.com/CDaifr4fjM
— Ashish Paswan (@ashishpaswan0) September 17, 2026