ఆదివారం 12 జూలై 2020
National - Jun 27, 2020 , 12:50:36

దేశ వ్యతిరేక వ్యాఖ్యలు... కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

దేశ వ్యతిరేక వ్యాఖ్యలు... కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సిమ్లా : సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకుగాను కాంగ్రెస్‌ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు, పార్లమెంటరీ మాజీ చీఫ్‌ సెక్రటరీ నీరజ్‌ భారతి ఇటీవల జరిగిన గల్వాన్‌ ఘటనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై సిమ్లాకు చెందిన న్యాయవాది నరేంద్ర గులేరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజద్రోహానికి పాల్పడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ దేశ ప్రజల మధ్య విద్వేశాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నీరజ్‌ భారతిని నిన్న అరెస్టు చేశారు. నేడు ఆయనను కోర్టులో హాజరు పర్చనున్నారు. 


logo