Drugs | గువహటి : అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ – అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే భారీ మొత్తంలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారని అసోం పోలీసులకు సమాచారం అందింది. దీంతో అసోం పోలీసు ఉన్నతాధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేశారు. మణిపూర్‌లోని కంగ్పోక్పి నుంచి అసోంలోని దిగువ రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు నిఘా పెట్టి సీజ్ చేశారు.
ఈ హెరాయిన్‌ను గువహటిలోని ముర్తజా అహ్మద్ అలియాస్ భూలుకు వద్దకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో తరలిస్తున్న 637 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని 49 సోప్ బాక్సులలో ఉంచి తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ. 6 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Marriage | పాకిస్తాన్ యువతిని పెళ్లాడిన బీజేపీ కార్పొరేటర్ కుమారుడు.. ఆన్లైన్లో నిఖా
Blast in Delhi | ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం