Blast in Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. నేను ఇంట్లో ఉండగా, భారీ శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూడగా స్కూల్ సమీపంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఆ దృశ్యాలను తన ఫోన్లో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకు మించి తనకు ఏమి తెలియదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Karnataka | ఏరివేత షురూ.. 5 గ్యారెంటీలకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు కొర్రీలు
Scissors | ఆపరేషన్లో మరచి.. 12 ఏండ్లుగా కడుపులో కత్తెర
Flights- Bomb Threats | 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు