Scissors | గ్యాంగ్టక్, అక్టోబర్ 19: ఆపరేషన్ సమయంలో ఒక మహిళ పొత్తి కడుపులో ఉంచి మరచిపోయిన కత్తెరను 12 ఏండ్ల తర్వాత డాక్టర్లు తొలగించిన ఘటన సిక్కింలో చోటు చేసుకుంది. ఒక మహిళకు ఎస్టీఎన్ఎం దవాఖానలో 12 ఏండ్ల క్రితం అపండిసైటిస్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సలో వాడే ఒక కత్తెరను ఆమె కడుపులో ఉంచి కుట్టేశారు. చివరకు ఆదే దవాఖానలో ఎక్స్రే తీయగా ఆమె కడుపులో కత్తెర ఉన్నట్టు గుర్తించారు. గురువారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని నియమించారు.