Flights- Bomb Threats | న్యూఢిల్లీ: భారత్‌లో పలు విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు..మరింతగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.
ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, ఆకాస ఎయిర్, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్..తదితర సంస్థలకు చెందిన విమానాలకు శనివారం ఉదయం నుంచి బాంబు బెదిరింపులు రావటం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది.
హైదరాబాద్ నుంచి చండీగఢ్ బయల్దేరిన ఇండిగో ఫ్లైట్‌కు హెచ్చరికలు జారీ కాగా, చండీగఢ్‌లో పైలట్లు విమానాన్ని ఐసోలేషన్ బే వైపు ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపు బూటకమని తేల్చారు.