హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ పదవిపై మంత్రి అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు వస్తుందంటూ అజారుద్దీన్‌ను విలేకరులు ప్రశ్నించగా… వ స్తుంది అని ఆయన సమాధానమిచ్చా రు. వెంటనే విలేకరులు ‘ఎలా వస్తుం ది..? మరో నెల రోజులే గడువు ఉంది కదా..?’ అంటూ ప్రశ్నించగా ‘ఊపర్ భగవాన్ హై’ అంటూ సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానటువంటి అజారుద్దీన్‌కు కాంగ్రెస్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆర్నెల్లలోపు ఆయన ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఉండాలి. మరో నెల రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.