చెన్నై: కోచింగ్ సెంటర్లో (Coaching Center) నిద్రపోతున్నారని విద్యార్థులపై విరుచుకుపడ్డాడో నిర్వాహకుడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేవారు. తమిళనాడులోని తిరునెల్వీల జలాల్ అహ్మద్ అనే వ్యక్తి నీట్ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు తరగతి గదిలో నిద్రపోతూ అతనికి కనిపించారు. దీంతో అబ్బాయిలను కర్రతో విచక్షణా రహితంగా కొట్టిన అతడు.. అమ్మాయిలపై చెప్పులు విసిరేశాడు. ఇదంతా క్లాస్‌రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదయింది.
ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ.. విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో జలాల్ అహ్మద్‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. కాగా, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కూడా ఈ ఘనపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కోచింగ్ సెంటర్‌ను హెచ్ఆర్సీ సభ్యులు పరిశీలించారు. విద్యార్థులపై దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.