Marriage | లక్నో : పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతిని బీజేపీ కార్పొరేటర్ కుమారుడు పెళ్లాడాడు. ఆన్లైన్ ద్వారా నిఖా నిర్వహించి పెళ్లి తంతును ముగించేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్‌కు బీజేపీ కార్పొరేటర్ తహషీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు పాకిస్తాన్ లాహోర్‌లోని అండ్లీప్ జహ్రాతో వివాహం జరిపించారు. అయితే వరుడు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా అతను వీసా పొందలేకపోయాడు.
అయితే పెళ్లి కుమార్తె తల్లి రాణా యాష్మిన్ జైదీ తీవ్ర అనారోగ్యం కారణంగా ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని షాహీద్.. అబ్బాస్, అండ్లీప్ వివాహ వేడుకను ఆన్లైన్ నిఖా నిర్వహించి జరిపించారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే తన భార్య అండ్లీప్కు ఇండియన్ వీసా లభిస్తుందని అబ్బాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Blast in Delhi | ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం
Indore | గడ్డం తీసేస్తేనే ప్రేమిస్తామంటున్న ఇండోర్‌లో యువతులు..