Indore | ఇండోర్, అక్టోబర్ 19: ఉద్యోగాలు ఇవ్వాలనో, తమ సమస్యలు పరిష్కరించాలనో యువతులు ర్యాలీలు తీయడం సహజం. కానీ, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం కొందరు యువతులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ‘గడ్డం తీసేస్తేనే.. మిమ్మల్ని ప్రేమిస్తాం’ అంటూ ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేశారు. దాదాపు 20 మంది యువతులు మాస్కులు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
‘క్లీన్ షేవ్ లేకపోతే.. ప్రేమ లేదు’, ‘గడ్డం కావాలా? ప్రియురాలు కావాలా?’ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ప్రదర్శన లేదా రీల్స్ కోసం ఇది చేసి ఉంటారని కొందరు విమర్శించగా… వారి ర్యాలీ వినోదం కలిగించిందని కొందరు కామెంట్ చేశారు.