Mumbai Rains | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముంబైలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముంబై (Mumbai) సహా మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో రాగల 48 గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ జారీ చేశారు. దీంతోపాటు ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరో ఘటనలో ఉత్తరకాశీ జిల్లా పురోలా తహసీల్ లోని కంద్యాల్ గ్రామంలో పొలంలో నాట్లు వేస్తుండగా అభిషేక్ (20) అనే యువకుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Also Read..
Maharashtra | బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో.. ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గోసంరక్షకులు
Air India | జైపూర్ లో విమానం అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించిన పైలట్
Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు