Viral Video | ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి నేలను ఢీకొన్న హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే
Viral Video : నేపాల్‌లో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, అదుపుకోల్పోయి నేలను ఢీకొని, గిరగిరా తిరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది.
Viral Video : నేపాల్‌లో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, అదుపుకోల్పోయి నేలను ఢీకొని, గిరగిరా తిరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది. నేపాల్‌లో ఎయిర్ డైనాస్టి సంస్థకు చెందిన 9ఎన్ ఏఎఫ్క్యూ అనే హెలికాప్టర్ ఐదుగురు ప్రయాణికులతో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఖోతాంగ్ జిల్లాకు బయల్దేరింది. అక్కడ బలబేసి అనే ప్రాంతంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించింది.
అయితే, ఇది పర్వత ప్రాంతం. నేల అంత చదునుగా ఉండదు. పైగా భారీ వేగంతో గాలి వీస్తుంది. వాతావరణం అనుకూలం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ బలబేసి వద్ద ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ల్యాండింగ్ చేసే సమయంలో భారీగా వీచిన గాలులు, ఎగసిపడ్డ ఇసుక వల్ల అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ల్యాండింగ్ చేసే క్రమంలో హెలికాప్టర్ అదుపుతప్పింది. ల్యాండ్ అయిన వెంటనే మళ్లీ అదే చోట అటు ఇటు ఎగిరింది. రెక్కలు వేగంతో తిరుగుతూ, గాలిలోకి ఎగిరింది. మళ్లీ నేలను ఢీకొంది. ఈ క్రమంలో హెలికాప్టర్ తోక భాగం ఊడిపోయింది. రెక్కలు విరిగిపోయాయి. అలా హెలికాప్టర్ బోల్తా కొట్టి, ధ్వంసమై ఆగిపోయింది. అయితే, ఈ ఘటనలో ఒకరికి మినహా మిగతా వారెవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.
Helicopter operated by Air Dynasty Heli Service Pvt. Ltd. crashes while landing in Khotang; one passenger injured, pilot and others safe.
Preliminary cause suspected to be strong winds or dust.#Nepal pic.twitter.com/au6YRncx8U
— Smriti Sharma (@SmritiSharma_) March 18, 2026
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ వద్దకు స్థానికులు వచ్చి ప్రయాణికుల్ని, సిబ్బందిని రక్షించారు. సమాచారం అందుకున్న అధికారులు మరో హెలికాప్టర్ ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని తరలించారు. ఈ ఘటనపై నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా స్పందించింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పింది. అయితే, ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Balabesi
- Helicopter
- Kathmandu
- Nepal
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

