తుంగతుర్తిలో వెలగని వీధి దీపాలు
తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్..
– పట్టించుకోని గ్రామ సర్పంచ్
– భయాందోళనలో ప్రజలు
తుంగతుర్తి, మార్చి 18 : తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తున్నా వీధి దీపాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన వీధి దీపాలే అక్కడక్కడ వెలుగుతున్నాయే తప్పా ఇంతవరకు కొత్తవి ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుండి బయటకు రావాలంటే తీవ్ర భయాందోళ చెందుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లో విష పురుగులు, వీధి కుక్కల సంచారం అధికంగా ఉండడంతో పొద్దుగూకితే ఇళ్లలో నుండి బయటకు రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

