Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు
Himachal Pradesh Floods | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి.
Himachal Pradesh Floods | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురిసిన భారీ వర్షాలకు వరదలు (Floods) సంభవించాయి. మండి (Mandi) జిల్లాలోని బాగిపుల్ (Bagipul) ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రశార్ సరస్సు (Prashar Lake) సమీపంలో వరదలు సంభవించాయని.. దీంతో టూరిస్టులు వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
‘మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో గల ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన (Baggi Bridge) సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, జాతీయ రహదారిని మూసేశాం. ఆ రహదారిని తిరిగి ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుంది. అక్కడ చిక్కుకున్న వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డీఎస్పీ సూద్ వెల్లడించారు.
Himachal Pradesh | Heavy rainfall in Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam pic.twitter.com/GfFtAcR9O5
— ANI (@ANI) June 26, 2023
Also Read..
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం
Odisha | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. పది మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

