High Court | బీఆర్ఎస్ ఫిర్యాదును పరిష్కరించండి.. ఫోన్ల ట్యాపింగ్‌పై కేంద్రానికి హైకోర్టు ఆదేశం
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలన్న ఫిర్యాదును పరిషరించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
High Court | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలన్న ఫిర్యాదును పరిష్కరించాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేలా గూగుల్, యూట్యూబ్, ఇతర షోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించడంలో కేంద్రం విఫలమైందంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు.
ఫోన్ల ట్యాపింగ్ అంశంపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాజనిత కథనాలు 2021లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలపై నిరాధార ఆరోపణలు రాకుండా నిరోధించాల్సిన అవసరం ఉన్నదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి వివరించారు. ఈ విషయమై గత నెల 25న కేంద్రానికి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సమాచారాన్ని గూగుల్, యూట్యూబ్ నుంచి తొలగించాలని, లేదంటే ఆ సమాచారం ఇతరులకు అందుబాటులో లేకుండా నియంత్రించేలా ఆయా సంస్థలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ వినతిపత్రంపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

