బూర్గంపహాడ్, మార్చి 18 : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీడీఏ డీడీ అశోక్, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీలత, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఉపేందర్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, దమ్మపేట ఏటీడీఓ చంద్రమోహన్, భద్రాచలం ఏఎస్డబ్ల్యూ హనుమంతరావు, పాల్వంచ ఏఎస్ఐడబ్ల్యుఓ, హెచ్డబ్ల్యూఓ అక్షయ్, సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పోరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.