ఎన్హెచ్ఎం సమస్యలు పరిష్కరించాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మహేందర్‌రావు పుట్టా డిమాండ్ చేశారు. సోమవారం ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చలో కమిషనరేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 78 క్యాడర్లకు చెందిన సుమారు 15000 మంది ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.
- ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో కమిషనరేట్’ కార్యక్రమం
- ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు, స్టేషన్‌కు తరలింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మహేందర్‌రావు పుట్టా డిమాండ్ చేశారు. సోమవారం ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చలో కమిషనరేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 78 క్యాడర్లకు చెందిన సుమారు 15000 మంది ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘సమాన పనికి సమాన వేతనం.. ప్రజారోగ్యమే మా బాధ్యత.. మా ఉద్యోగ భద్రత ప్రభుత్వ బాధ్యత’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మహేందర్‌రావు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సత్వరమే స్పందించి న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఎండీ రుక్ముద్దీన్, వైస్ ప్రెసిడెంట్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుమన్, సోషల్ మీడియా ఇన్చార్జి మొగిలి నరేశ్, స్టేట్ కో ఆర్డినేటర్ సెక్రటరీ వినోద్, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ హరిప్రియ, నేతలు వినోద, స్వప్న, రేణుక, నిహారిక, కల్యాణి, విజేత తదితరులు పాల్గొన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులపై పోలీసు జులుం
చలో కమిషనరేట్ కార్యక్రమానికి తరలివస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను నిర్బంధించి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. పోలీసుల వైఖరిపై ఎన్ఎహెచ్ఎం జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరసన తెలిపే హక్కుపై నిర్బంధం విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్టుపెట్టుకొని పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కుట్రలు కట్టిపెట్టి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

