తడి, పొడి చెత్త సేకరణపై విద్యార్థులకు అవగాహన
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ, వర్మికంపోస్ట్ తయారీ తదితర అంశాలపై..
బూర్గంపహాడ్, మార్చి 18 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ, వర్మికంపోస్ట్ తయారీ తదితర అంశాలపై సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు బుధవారం అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి అడిషనల్ డీఆర్డీఓ రవి, ఎంపీడీఓ జమలారెడ్డి హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయం నుండి డంపింగ్ షెడ్ వరకు విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి అక్కడ వర్మి కంపోస్ట్ తయారీ, తడి, పొడి చెత్త వేరు చేయడంపై ఎస్పీఎం రేవతి అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వివరించి ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు దుర్గ, లక్ష్మి, బత్తుల శిరీష, కరం సామ్రాజ్యం, కార్యదర్శి స్పందన, ఏపీఓ, ఈసీ, టీఏ, ఎఫ్ఎలతో పాటు కళాశాల అధ్యాపకులు, గ్రామ పంచాయతీ మల్టీపర్సస్ వర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

