Cyclone Montha | మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో భారీ వర్షం (Heavy rain) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడనంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెన్నైలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెన్నైతోపాటూ చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కన్యాకుమారి, తెంకాసి, తిరునల్వేలి, తిరువన్నమలై, వెల్లూరు, విలుప్పురంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌ల వద్ద కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది.
VIDEO | Tamil Nadu: Choolaimedu, a residential area in Chennai, witnesses waterlogging following heavy rain.#ChennaiRains #TamilNaduWeather #Waterlogging
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/EQPhOThBm2
— Press Trust of India (@PTI_News) October 28, 2025
#WATCH | Chennai, Tamil Nadu: Cyclone Montha is expected to cross the coast today, with the Bay of Bengal sea seeming rough at Chennai’s Pattinapakkam beach near Marina.
Aggressive waves are visible with moderate rain. Following warnings from the Chennai Meteorological… pic.twitter.com/7V82gNHLmt
— ANI (@ANI) October 28, 2025
Also Read..
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు
Cloud seeding | నేడు ఢిల్లీలో కృత్రిమ వర్షం
BJP MLA | యమునా శుభ్రతపై రీల్స్.. అదుపుతప్పి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. VIDEO