BJP MLA | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి (BJP MLA) షాకింగ్ అనుభవం ఎదురైంది. యమునా నది (Yamuna River) శుభత్రపై రీల్స్ (reel) చేస్తూ కాలుజారి నదిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఛట్ పూజ వేడుకల నేపథ్యంలో యమునా నది శుభ్రతపై అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాము అధికారం చేపట్టిన తర్వాత యమునా శుభ్రమైందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే, బీజేపీ ప్రచారాన్ని ఆప్ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో యమునా నది శుభ్రతపై అవగాహన కల్పించేందుకు పత్పర్గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి (Ravinder Singh Negi) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే నది ఒడ్డున రీల్ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి నదిలోకి పడిపోయారు.
19 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో, ఎమ్మెల్యే నేగి రెండు బాటిళ్లను చేతిలో పట్టుకుని యమునా నది ఒడ్డున మోకాళ్లపై కూర్చుని ఉంటారు. అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నించగా.. అదుపుతప్పి ఒక్కసారిగా నీటిలో పడిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై ఆప్ నేత సంజీవ్ ఝా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నాయకులకు తప్పుడు వాగ్దానాలు చేయడం ఓ వృత్తిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. బహుశా అబద్ధాలు, ప్రచార రాజకీయాలతో విసిగిపోయిన యమునా మాత.. స్వయంగా వారిని తన వద్దకు పిలిపించుకున్నట్టుంది అంటూ చురకలంటించారు.
क्या विधायक जी, कितना नाटक करोगे, इसी नाटकबाजी के लिए मोदी जी के नाम पर इलेक्शन जीते थे क्या ?
ये है दिल्ली से भाजपा विधायक रवि नेगी, यमुना की सफाई को लेकर रील बना रहे थे, पैर फिसला और सीधे यमुना में जा गिरे। बस रील बननी चाहिए चाहे ख़ुद की रेल बन जाय। @BJP4India @BJP4Delhi pic.twitter.com/uLcQoVqBwe— Ajit Singh Rathi (@AjitSinghRathi) October 26, 2025
Also Read..
Gold Rates | మరింత దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం
Amazon | భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన అమెజాన్.. కంపెనీ చరిత్రలోనే..!
Acid Attack: యాసిడ్ దాడి కాదు.. అది టాయిలెట్ క్లీనర్.. ఢిల్లీ అటాక్ కేసులో ట్విస్ట్