Amazon | ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఏకంగా 30వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను (Corporate Employees) తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తాజా తొలగింపులు కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదిగా ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
అమెజాన్‌లో 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం. 2020 తర్వాత కంపెనీలో ఈస్థాయిలో లేఆఫ్స్ జరగడం ఇదే తొలిసారి అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 2022 చివరి నుంచి దాదాపు 27వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. ఇప్పుడు ఏకంగా 30 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నివేదికలు వెల్లడించాయి.
ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఈ తాజా లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ లేఆఫ్స్ కంపెనీలోని మానవ వనరులు, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసులు సేవల విభాగాలతో సహా మరికొన్ని ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది. ఒక్క మానవ వనరుల విభాగంలో ఈసారి 15 శాతం మంది తమ జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read..
49 శాతానికి ఎఫ్‌డీఐలు.. విదేశీ గుప్పిట్లోకి సర్కార్ బ్యాంకులు!
సూచీలకు ఫెడ్ అంచనాల కిక్కు.. భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు