రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడడం లేదు. గత పది రోజులుగా అనేక మలుపులు తిరుగు తున్న ది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినా అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే చైర్మన్ ఎన్నిక విషయంలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇబ్రహీంపట్నంలో మాత్రం చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారి రోజుకో మలుపు తిరుగుతున్నది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి విషయంలో ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం చైర్మన్ ఎన్నికను వాయిదా వేసింది. అలాగే, చైర్మన్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిని ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కానీ, అధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి తనకు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో తనను చైర్మన్‌గా ఎన్ను కోవాలని కోరుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం చైర్మ న్ ఎన్నికల విషయంలో ప్రస్తుతం రెండు కేసులు హైకోర్టులో కొనసాగుతున్నాయి.
కౌన్సిలర్లపై రోజుకో వివాదం..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలో గెలుపొందిన పలువురు కౌన్సిలర్లపై పోటీ చేసి ఓడిపోయిన అభ్య ర్థులు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. కౌన్సిలర్‌గా గెలు పొందిన చిలుకల బుగ్గరాములు రెండుచోట్ల ఎన్నికల్లో ఓటేశారని ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈగల రాములు.. అలాగే, బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నీలం శ్వేత ఓసీ జనరల్ అయ్యి ఉండి బీసీ సర్టిఫికెట్ తో ఎన్నికల్లో గెలుపొందారని ఆమెపై ఓడిపోయిన చంద్రకళ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 9వ వా ర్డు నుంచి గెలుపొందిన రాఘవేందర్ సివిల్ కాం ట్రాక్టు లైసెన్స్ పొంది ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందా రని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన చేతిలో ఓడిపోయిన రవీందర్‌రెడ్డి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
తనను చైర్మన్‌గా ప్రకటించాలని హైకోర్టులో సుదర్శన్‌రెడ్డి పిటిషన్
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌గా తనను బీఆర్ఎస్కు చెందిన 13మంది సభ్యులతోపాటు ఓ స్వ తంత్ర అభ్యర్థి, మరో బీజేపీ అభ్యర్థితో కలిపి 15మంది కౌన్సిలర్లు ఎన్నుకున్నారని, ఎన్నికల అధికారి మాత్రం రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి చైర్మన్‌గా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 24న ఆ కేసును విచారిస్తామని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని హాజరు కావల్సిందిగా ఆదేశించింది. కాగా, కేసులు అధికంగా ఉండడంతో గత మూడు రోజులుగా సుదర్శన్‌రెడ్డి పిటిషన్ బెంచిపైకి రాలేదు. తాను చైర్మన్‌గా ఎన్నికైనట్లు అన్ని ఆధారాలను పొందుపరుస్తూ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు.
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న విభేదాల క్యాంపు..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీని బీఆర్ఎస్ సాధించినా కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నది. మంత్రి పదవి కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం చైర్మన్ పీఠంపై అనేక కుట్రలు పన్నుతున్నారు. కాగా, క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు నేనంటే నేను చైర్మన్ అవుతానంటూ పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే తనకే చైర్మన్ పదవి ఇస్తానని మాటిచ్చారని ముగ్గురు వ్యక్తులు పోటాపోటీగా సవాల్ విసురుకుంటున్నారు.
ఓ వైపు మాజీ చైర్మన్‌గా ఉండి ప్రస్తుతం కౌన్సిలర్‌గా గెలుపొంది ఎన్ని డబ్బులైనా ఖర్చుపెట్టి చైర్మన్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తుండగా.. శేరిగూడ గ్రామానికి చెందిన మరో కౌన్సిలర్ ఎమ్మెల్యేకు నేను అత్యంత ఆప్తుడినని తప్పకుండా చైర్మన్ అవుతానని పేర్కొంటుండగా.. ఇటీవల బీఆర్ఎస్కు అన్యాయం చేసి కాంగ్రెస్‌కు మద్దతు పలికిన కౌన్సిలర్ నేను పనిలేక వచ్చానా..? నేనే చైర్మన్ అంటూ కాంగ్రెస్ క్యాంపులో చెబుతుండడంతో అక్కడ రోజుకో రచ్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే తన స్వార్థం కోసం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో కుట్రలు చేయడం సరికాదని.. వెంటనే చైర్మన్‌ను ప్రకటించి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.