గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’.. ఇలా వరుస సంక్రాంతి విజయాలతో పండుగ హీరోయిన్గా పేరు గాంచింది హర్యానా అందం మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నాగచైతన్యతో ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ అందాలభామ. ఇదిలావుంటే.. ఓ అపూర్వమైన అవకాశం మీనాక్షి చౌదరి తలుపు తట్టినట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో మీనాక్షి చౌదరి నటించనున్నదట.
అయితే.. ఆమెది హీరోయిన్ పాత్ర కాదని, ఓ అతిథి పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలుస్తున్నది. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె పాత్ర ఉంటుందట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే మెగాస్టార్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, మాఫియా నేపథ్యంలో ఆయన పాత్ర సాగుతుందని వినికిడి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ, లోహత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.