Cloud seeding | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. తీవ్రమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.
వాతావరణం అనుకూలిస్తే ఇవాళ ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు అవకాశం ఉంది. పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో ఐదు చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. ఇటీవలే బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఈ వర్షం కారణంగా రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read..
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు
Gold Rates | మరింత దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం
BJP MLA | యమునా శుభ్రతపై రీల్స్.. అదుపుతప్పి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. VIDEO