బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు
రాష్ట్ర వ్యాప్తంగా జరిగి న ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
- హనుమకొండలో చాహత్ బాజ్‌పాయ్..
- మహబూబాబాద్‌లో స్నేహా శబరీష్..
- జనగామలో సందీప్‌కుమార్ ఝా
- కరీంనగర్ కలెక్టర్‌గా ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా బదిలీ
హనుమకొండ, ఫిబ్రవరి 26 : రాష్ట్ర వ్యాప్తంగా జరిగి న ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించగా బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న అద్వైత్‌కుమార్ సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్‌పాయ్‌కు హనుమకొండ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా ను జోగులాంబ గద్వాల కలెక్టర్‌గా బదిలీ చేయగా, అతడి స్థానంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సందీప్‌కుమార్ ఝా నియమించారు. అలాగే ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిష్రాను కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఆమె స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ (కన్ఫర్డ్ ఐఏఎస్)ను వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా పోస్టింగ్ ఇచ్చారు. జనగామ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్మార్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

