BBC | పెహల్గామ్లోని (Pahalgam attack) మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఈనెల 22న జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ దాడిని భారత్ సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, ఈ దాడి ఘటనపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ (BBC) ఇస్తున్న కవరేజీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది.
పెహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీబీసీ ఇటీవలే ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, అందులో ఉగ్ర దాడిని ‘మిలిటెంట్ దాడి’గా పేర్కొంది. దీంతో బీబీసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ తీరుపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీబీసీ ఇండియా హెడ్ (BBC India head) జాకీ మార్టిన్ (Jackie Martin)ను మందలిస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ లేఖ రాసింది. ఇకపై బీబీసీ కవరేజీని పర్యవేక్షిస్తామని నోటీసుల్లో పేర్కొంది.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులకు జారీ చేసే అన్ని వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీసా పొంది భారత్‌లో ఉంటున్న వారు వెంటనే వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్‌కు తిరిగి వెళ్లిపోయారు. అదేవిధంగా భారత్‌కు చెందిన 14 మంది దౌత్యవేత్తలు సహా 850 మంది ఈ అంతర్జాతీయ సరిహద్దు గుండానే భారత్‌కు చేరుకున్నారు. ఒక వేళ ఆదేశాలు ధిక్కరించి, ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ లోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్థానీయులను అధికారులు అరెస్ట్ చేస్తారు. వారికి మూడేండ్ల జైలు శిక్ష, లేదా రూ.3 లక్షల జరిమానా లేక రెండు శిక్షలూ విధిస్తారు.
Also Read..
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీతో రాజ్‌నాథ్, అజిత్ దోవల్ కీలక భేటీ
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్