YouTube channels | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కూడా నిషేధం విధించింది. దాదాపు 16 యూట్యూబ్ ఛానళ్లపై వేటు (YouTube channels) వేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు.. రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్ వ్యాప్తి, అలాగే భారత దేశం, భారత సైన్యం, భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు, తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar)తోపాటు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఆయా యూట్యూబ్‌లను యాక్సెస్ చేయగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో సందేశం కనిపిస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి కూడా కేంద్రం నోటీసులు పంపింది. పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంతో నోటీసులు జారీ చేసింది.
On the recommendations of the Ministry of Home Affairs, the Government of India has banned the 16 Pakistani YouTube channels including Dawn News, Samaa TV, Ary News, Geo News for disseminating provocative and communally sensitive content, false and misleading narratives and… pic.twitter.com/AusR1fCkvN
— ANI (@ANI) April 28, 2025
Also Read..
Pahalgam attack | బాధ్యతాయుతంగా పరిష్కరించుకోండి.. భారత్ – పాక్‌కు అమెరికా సూచన
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
Pahalgam Attack | 22 గంటలు ట్రెక్కింగ్ చేసి.. కోకెర్నాగ్ అడవుల నుంచి పహల్గాంకు ముష్కరులు!