Pahalgam attack | పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam attack)తో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిని భారత్‌తోపాటు అమెరికా సహా ప్రపంచ దేశాలు ముక్తఖంటంతో ఖండించాయి. పెహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు చెత్తపనిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనపై అమెరికా తాజాగా మరోసారి స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ సూచించింది.
‘పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్ అండగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ కూడా పెహల్గామ్ ఉగ్రదాడిపై మాట్లాడారు. ఈ దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను భారత్-పాక్‌లు పరిష్కరించుకుంటాయని తాము నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు.
Also Read..
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
Pahalgam Attack | 22 గంటలు ట్రెక్కింగ్ చేసి.. కోకెర్నాగ్ అడవుల నుంచి పహల్గాంకు ముష్కరులు!
ఉగ్ర తూటాలకు సామాజిక కార్యకర్త బలి