శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని కుప్వా రా జిల్లాలో ఉగ్రవాదులు గులాం రసూల్ మాగ్రే(45) అనే సామాజిక కార్యకర్తను కాల్చి చంపారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని చెప్పారు. కండి ఖాస్‌లోని మాగ్రే నివాసంలోనే ఆయనపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపారు. మాగ్రేను వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఉగ్రవాదులు ఈ హత్యకు ఎందుకు పాల్పడ్డారో కారణాలు తెలియలేదు.