Employee Steals From Minister’s Office | మంత్రి కార్యాలయంలో చోరీ.. బంగారం, నగదు దొంగిలించిన ఉద్యోగి
Employee Steals From Minister's Office | మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్‌ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్‌ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. (Employee Steals From Minister’s Office) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గత వారం విధానసౌధలోని పట్టణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక మంత్రి బైరతి సురేష్ కార్యాలయాన్ని నవీన్ అనే వ్యక్తి సందర్శించాడు. వెంట తెచ్చిన బ్యాగ్‌ను అక్కడ వదిలేశాడు. ఆ తర్వాత వచ్చి చూడగా ఆ బ్యాగ్ కనిపించలేదు.
కాగా, ఆ బ్యాగ్ మిస్సింగ్‌పై విధానసౌధ పోలీసులకు నవీన్ ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగ్‌లో 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. విధానసౌధలోని గ్రూప్ డీ ఉద్యోగి ఆంటోనీ ఆ బ్యాగ్ తీసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ ఉద్యోగి నుంచి కొంత బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా బంగారం, నగదు రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అలాగే బంగారం, డబ్బు ఉన్న బ్యాగ్‌ను ఆ వ్యక్తి మంత్రి కార్యాలయానికి ఎందుకు తెచ్చాడు అన్నది ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసు.. బాబా అరెస్ట్
Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్‌తో కానిస్టేబుల్స్ సస్పెండ్
Thailand School shooting | థాయిలాండ్ స్కూల్లో కాల్పులు.. విద్యార్థులు, టీచర్స్ కొంతసేపు బందీ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cash
- employee
- gold
- Government
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

