Janhvi Kapoor | జాన్వీ కపూర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. అసభ్యకర కంటెంట్ తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
Janhvi Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Janhvi Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, AI ద్వారా సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని కీలక ఆదేశాలు జారీ చేశారు. అసభ్యకరంగా ఉన్న కంటెంట్‌ను, అలాగే ఎవరైనా ఆమె పేరును వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తుంటే ఆ పోస్టులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పర్సనాలిటీ రైట్స్ అనే భావనకు ఒక సరైన హద్దు ఉండాలని, సెలబ్రిటీల హక్కులను రక్షించడంతోపాటు భావప్రకటన స్వేచ్ఛను కూడా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించలేమని కోర్టు పేర్కొంది. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎవరైనా ఆమె పేరును వాడుకుంటేనే కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చునని, అయితే అన్ని ఫ్యాన్ పేజీలను నేరపూరితమైనవిగా పరిగణించలేమని తెలిపారు. కొందరు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మక ధోరణిలో కూడా పోస్టులు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి గుర్తుచేశారు.
ఈ కేసులో మెటా (Meta) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ తరఫున ఇప్పటికే 4,000కు పైగా యూఆర్ఎల్లను (URLs) సమర్పించారని, అయితే ఆ కంటెంట్ అంతా ఒకేలా అభ్యంతరకరంగా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంటెంట్‌ను స్పష్టమైన వర్గాలుగా విభజించి తదుపరి విచారణకు కోర్టు ముందుంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు. గతంలో కూడా పలువురు ప్రముఖ నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

