ఈ బుడ్డోడి పాఠాలకు లక్షల మంది ఫాలోవర్లు
నేను 2002 ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాను. చేరిన కొత్తలోనే వినూత్నమైన బోధనకు శ్రీకారం చుట్టాను. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో భాగంగా వారితో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం నాకు అలవాటు. పాఠ్యపుస్తకంలోని అంశాలు అర్థం చేయించేందుకు 2014లో పాటల పాఠాలు, 2015లో విద్య వికసించేదెలా? అనే రెండు పుస్తకాలు రాశాను.
ఇంగ్లిష్ గ్రామర్ అయినా, గణిత సూత్రాలైనా.. ఏవైనా సరే ఈ పిల్లాడు చెప్పాడంటే అది లక్షల మందికి చేరిపోతుంది. అలాగని తానేదో ఐఐటీ ఫౌండేషన్‌లో చదువుకోలేదు. పెద్ద కార్పొరేట్ స్కూల్‌కూ వెళ్లడం లేదు. ఈ బుడ్డోడు చదివేది ఓ గ్రామంలో ఉన్న సర్కార్ బడిలో! పిట్టకొంచెం కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతాడు తొమ్మిదేండ్ల చింతకింది వరుణ్. ఐదో తరగతిలోనే బోర్డుపై పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఈ కుర్రాడిని సోషల్ మీడియాకు పరిచయం చేసిన ఆ పాఠశాల హెచ్ఎం కుక్కడపు రమేశ్ తన విద్యార్థి ప్రతిభ గురించి బతుకమ్మతో ఇలా పంచుకున్నారు..
నేను 2002 ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాను. చేరిన కొత్తలోనే వినూత్నమైన బోధనకు శ్రీకారం చుట్టాను. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో భాగంగా వారితో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం నాకు అలవాటు. పాఠ్యపుస్తకంలోని అంశాలు అర్థం చేయించేందుకు 2014లో పాటల పాఠాలు, 2015లో విద్య వికసించేదెలా? అనే రెండు పుస్తకాలు రాశాను. అయితే పుస్తక పఠనం తగ్గిపోతున్న నేపథ్యంలో 2019లో ‘రమేశ్ సార్ స్టడీ సాంగ్స్’ పేరుతో సోషల్ మీడియా ఖాతా తెరిచాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్పూర్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్న నాకు వరుణ్ రెండేండ్ల నుంచి పరిచయం. వరుణ్ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచాన్‌పల్లి మండలంలోని జూలూరు. అయితే ఆ అబ్బాయి కుటుంబం ఉపాధిని వెతుక్కుంటూ పహిల్వాన్పూర్కు వలసొచ్చి తోటపనిలో కుదిరింది. అలా వరుణ్‌తోపాటు, అతని చెల్లెలు కూడా మా బడిలోనే చేరారు.
అలా మొదలు నేను పాఠాలు చెప్పే సందర్భంలో ఆ పాఠం విద్యార్థులకు అర్థమైందో లేదో అని తెలుసుకునేందుకు తిరిగి వారిచేతే చెప్పిస్తుంటాను. ఈ సమయంలోనే వరుణ్ టాలెంట్ బయటపడింది. ఆ అబ్బాయి అందరిలాగా కాకుండా నేను చెప్పిన ైస్టెల్లో తిరిగి నాకు అప్పచెప్పడం చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక్కసారి వింటే చాలు తిరిగి తనకు అర్థమైన రీతిలో చెప్పే ఆ టాలెంట్ విద్యార్థుల్లో అరుదుగా ఉంటుంది. ఆరు నెలల క్రితం అనుకోకుండా తను ఓ పాఠం వివరిస్తుండగా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. ఆ వీడియాను చూసిన వాళ్లంతా ఆ పిల్లాడి మేధస్సును మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అలా వరుణ్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. నా సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న 6000 వీడియోల్లో 700కు పైగా వీడియోలు వరుణ్వే. చాలామంది సామాజిక మాధ్యమాలన్నా, కెమెరా ముందుకు రావాలన్నా భయపడతారు. ఈ పిల్లాడు మాత్రం అవలీలగా పాఠం మొత్తం చెప్పేస్తాడు. చాలామంది స్క్రిప్ట్ ప్రకారమే వీడియోలో మాట్లాడతాడని భావిస్తారు! కానీ, నేను వరుణ్‌కు ఎలాంటి స్క్రిప్టూ ఇవ్వను. తాను మాట్లాడే అంశాన్ని వివరిస్తాను అంతే. తన అవగాహన మేరకు చెబుతూపోతాడు.

మోటివేషనల్ స్పీకర్‌గా
ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న వరుణ్ ఇంగ్లిష్, లెక్కలు వంటి పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా సామాజిక అంశాలను కూడా భలేగా చెబుతాడు. అందుకోసం మా పాఠశాలలో ఉన్న మినీ లైబ్రరీలో ఇతిహాసాలు, నీతి కథలకు చెందిన పుస్తకాలను చదువుతాడు. అందులోని సారాన్ని ఈ తరానికి అన్వయించుకొని చెబుతాడు. కొంతమంది వరుణ్ వీడియోలు చూసి పాఠాలు నేర్చుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషమనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే కొన్ని పాఠశాలల్లో మోటివేషన్ స్పీకర్‌గా వెళ్లి అక్కడి విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నేను ప్రిపేరై వెళ్లినా వేదిక మీద అప్పుడప్పుడు తడబడుతుంటాను. కానీ, వరుణ్ మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటాడు. పాఠాలు బోధించడంలో మా ఇద్దరినీ మేడ్ ఫర్ ఇచ్ అదర్ అని అభివర్ణిస్తుంటారు.

కలెక్టర్ కావాలని
నిరుపేద విద్యార్థి అయిన వరుణ్ చదువు బాధ్యత తీసుకుంటామని చాలామంది ముందుకొస్తున్నారు. ఆ అబ్బాయి కలెక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతుంటాడు. అంతకంటే మరింత గొప్ప స్థాయికి ఎదగాలన్నది నా కోరిక. వరుణ్ ఎక్కడ ఉన్నా నా తోడు తనకు ఎప్పుడూ ఉంటుంది. చదువులోనూ ముందుండే వరుణ్ ఏ పరీక్ష పెట్టినా 20 నిమిషాల్లోనే సమాధానాలన్నీ రాసిస్తాడు. ఉపాధి కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ వృత్తిలోకి వస్తే ఇలాంటి వరుణ్‌లు ప్రతి పాఠశాలలోనూ తయారవుతారు. ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలతో అద్భుతాలను తయారు చేయొచ్చన్నది నా ఆలోచన.
…? రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

