బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 11:24:53

తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన యువతి

తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన యువతి

పాట్నా : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల కష్టాలు పడరాని కష్టాలు పడుతున్నారు. తమ సొంతూర్లకు వెళ్లేందుకు కొందరు కాలినడకన వెళ్తే.. ఇంకొందరు సైకిళ్లపై, మరికొందరు ట్రక్కుల్లో బయల్దేరారు. ఓ యువతి మాత్రం గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించింది. 

బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి తన పదిహేను ఏళ్ల కుమార్తెతో కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ.. దాంతో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని వెనక్కి తీసుకున్నాడు. అంతే కాకుండా వీరు ఉంటున్న గది అద్దెను చెల్లించాలని యజమాని డిమాండ్‌ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు సొంతూరికి పయనమయ్యారు. అయితే ఓ ట్రక్కు డ్రైవర్‌ను సంప్రదించగా.. రూ. 6 వేలు డిమాండ్‌ చేశాడు. చేసేదేమీ లేక రూ. 500లకు ఓ సైకిల్‌ను కొన్నారు.

ఇక మే 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు సైకిల్‌పై బయల్దేరారు. సుమారు వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్‌పై గాయపడ్డ తన తండ్రిని ఎక్కించుకుని సొంతూరికి వచ్చింది. అయితే మార్గమధ్యలో కేవలం రాత్రి సమయాల్లో 2 నుంచి 3 గంటలు మాత్రమే పెట్రోల్‌ బంకుల్లో విశ్రాంతి తీసుకునేవారు. మే 16న సొంతూరికి రాగానే తండ్రీకూతుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. 


logo