G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది. నరేగా (MGNREGA) స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) బిల్లు (G RAM G Bill)ని మంగళవారం లోక్సభలో (Lok Sabha) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు నేడు లోక్సభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. బిల్లు (VB G RAM G Bill)కు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. కొందరు వీబీ-జీ రామ్ జీ బిల్లు ప్రతులను చించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభ రేపటికి వాయిదా పడింది.
Also Read..
NAREGA vs G RAM G | నరేగా వర్సెస్ జీ రామ్ జీ! కొత్త ఉపాధి చట్టంతో నష్టమేనా?
IndiGo | కష్టకాలం ముగిసింది.. అతిపెద్ద తుఫాను నుంచి బయటపడ్డాం : ఇండిగో సీఈవో
Air India Express | విమానం గాల్లో ఉండగా ల్యాండింగ్ గేర్లో సమస్య.. కొచ్చికి దారి మళ్లింపు