Air India Express | జెడ్డా నుంచి కేరళలోని కోజికోడ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కొచ్చిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా.. ల్యాండిగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో అధికారుల సూచనల మేరకు విమానాన్ని కొచ్చికి (Cochin) మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం IX 398 ఇవాళ ఉదయం 160 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి కోజికోడ్‌కు (Jeddah to Kozhikode) బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్ ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. ఏటీసీ సూచనల మేరకు విమానాన్ని కొచ్చికి మళ్లించారు. పూర్తి అత్యవసర పరిస్థితుల్లో ఉదయం 09.07 గంటలకు విమానం కొచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. అక్కడ సాంకేతిక సిబ్బంది విమానాన్ని తనిఖీ చేయగా.. ల్యాండింగ్ గేర్తోపాటూ కుడివైపు ఉన్న రెండు టైర్లు పగిలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read..
Saudi Arabia | సౌదీ ఎడారిలో మంచు వర్షం.. ఫొటోలు, వీడియోలు వైరల్