Vijay Mallya | బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా (Vijay Mallya), లలిత్ మోదీ (Lalit Modi)లు దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ వారు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ మాల్యా 70వ పుట్టినరోజు సందర్భంగా లలిత్ మోదీ గ్రాండ్‌గా పార్టీ అరేంజ్ చేశారు.
బెల్గ్రేవ్ స్క్వేర్‌లోని లలిత్ మోదీ నివాసంలో జరిగిన హై ప్రొఫైల్ ప్రీ బర్త్‌డే వేడుకల్లో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-Shaw) కూడా హాజరయ్యారు. అంతేకాదు పలువురు ప్రముఖులు పాల్గొని పార్టీని ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పార్టీలో విజయ్‌మాల్యా, లలిత్ మోదీ ఉన్న ఫొటోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ జిమ్ రైడెల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘విజయ్ మాల్యా గౌరవార్థం నిన్న రాత్రి తన అందమైన లండన్ నివాసంలో (London Home) అద్భుతమైన ప్రీ బర్త్‌డే పార్టీని అరేంజ్ చేసినందుకు లలిత్ మోదీకి ధన్యవాదాలు’ అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. దీనికి లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు విజయ్ మాల్యా ప్రీ బర్త్‌డే వేడుకకు వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
భారత్‌లో తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ, విజయ్ మాల్యా పారిపోయి చాలాకాలంగా యూకేలోనే ఉంటున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాను భారత్ ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Also Read..
Saudi Arabia | సౌదీ ఎడారిలో మంచు వర్షం.. ఫొటోలు, వీడియోలు వైరల్
Dense Fog | ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం