Haryana Elections | హర్యానాలో (Haryana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సహా పలువురు ఓటు వేశారు.
#WATCH | On casting her first vote, Olympic medalist Manu Bhaker says, “Being the youth of this country, it is our responsibility to cast our vote for the most favourable candidate. Small steps lead to big goals… I voted for the first time…” https://t.co/806sYLcpoe pic.twitter.com/vQ5j4m7fFB
— ANI (@ANI) October 5, 2024
ఇక ఇటీవలే జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్ పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఝజ్జర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఉదయమే ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజా స్వామ్య పండగలో పాల్గొనాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. ‘నేను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాలను చేరుకుంటాయి. దేశ యువతగా ఓటు వేయడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.
“We will get more than 50 seats this time”: Former Haryana CM Khattar exudes confidence after casting his vote in state assembly polls
Read @ANI Story | https://t.co/bqacaL3gcI#Haryanapolls #ManoharlalKhattar #BJP pic.twitter.com/3c7xzXBUaa
— ANI Digital (@ani_digital) October 5, 2024
ఇక చక్రి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ రెజ్లర్, బీజేపీ నేత యోగేశ్ దత్, బబతి ఫొగాట్ తదితరులు ఓటు వేశారు.
#WATCH | Haryana: Independent candidate from the Hisar constituency, Savitri Jindal shows her inked finger after casting her vote at a polling booth in Hisar.
She says, “I have cast my vote. This is the election of the people of Hisar, everyone should vote. I will try to make… pic.twitter.com/GhXlycph4A
— ANI (@ANI) October 5, 2024
#WATCH | Haryana CM and BJP’s candidate from Ladwa assembly seat, Nayab Singh Saini shows his inked finger after casting his vote at a polling station in in Ambala for #HaryanaElelction pic.twitter.com/SYQ7dplqLo
— ANI (@ANI) October 5, 2024
#WATCH | Congress candidate from Julana Assembly Constituency Vinesh Phogat arrives at a polling station in Charkhi Dadri to cast her vote for #HaryanaElelction
She says, “It is a huge festival for Haryana and a very big day for the people of the state. I am making an appeal to… pic.twitter.com/7LoYTR0Xvl
— ANI (@ANI) October 5, 2024
Also Read..
Tirumala | తిరుమల లడ్డూ వివాదంలో ట్విస్ట్.. నెయ్యి కల్తీ అయ్యిందనడానికి ఇదే ఆధారం!
Osmania University | ఓయూకు ఏమైంది?.. అధికారుల వైఖరితో దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట!
HCT | పేరు మార్చి పట్టాలెక్కిస్తున్నారు.. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుకు హెచ్సిటీ కలరింగ్!