Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయల్దేరి వెళ్లింది. ఈ యాత్రను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రత (tight security) ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.
ఇటీవలే పహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమర్నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్నాథ్ యాత్ర మార్గాలను ‘నో ఫ్లై జోన్లు’గా జమ్ము ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (Shri Amarnathji Shrine Board) ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసులను (Helicopter Service ) రద్దు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అనుసరించి.. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకోవాలని తెలిపింది.
Also Read..
కారులోంచి లాగి బాలికపై అత్యాచారం.. మహిళల నుంచి బంగారం దోపిడీ.. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణం
Madhya Pradesh | ఛాతిపై కూర్చొని.. గొంతు కోసి!.. దవాఖానలో యువతి దారుణ హత్య
Indian Railways | రైల్వే సేవలన్నీ ఒకేచోట!.. అందుబాటులోకి రైల్‌వన్ సూపర్‌యాప్