Massive Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన 50 ఫైర్ ఇంజన్లు
Massive Fire | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది.
Massive Fire | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో గల కార్నివాల్ బాంక్వెట్ హాల్ (Carnival Banquet Hall)లో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బాంక్వెట్ హాల్ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
కనీసం 50 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ, ప్రాణాపాయం సంభవించలేదు. బాంక్వెట్ హాల్ మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఈ బాంక్వెట్ హాల్ అలీపూర్ (Alipur)లోని నరేలా రోడ్‌కి సమీపంలో ఉంటుంది. అలీపూర్ ప్రాంతంలో శుభకార్యాలకు ఈ హాల్ ప్రసిద్ధ గాంచింది.
#WATCH | Fire broke out in Carnival Resort in Delhi's Alipur. Fire tenders rushed to the spot.
More details awaited. pic.twitter.com/Z0BmPnr6Yz
— ANI (@ANI) May 24, 2024
Also Read..
Heatwave | ఉత్తరాదిన భానుడి ప్రతాపం.. వడదెబ్బ కారణంగా 12 మంది మృతి
SUV | కారును రివర్స్ చేస్తూ వృద్ధుడిపైకి ఎక్కించిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

