ముంబై: పోలీస్ అధికారి కొడుకు వేగంగా కారు నడిపాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. (cop’s son rams woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం భోశ్రీ ఎంఐడీసీ ప్రాంతంలో కొందరు మహిళలు రోడ్డు దాటుతున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మహిళ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారును గుర్తించారు. కారు డ్రైవర్ వినయ్ విలాస్ నాయక్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఒక పోలీస్ అధికారి కుమారుడని తెలిపారు. మరోవైపు మహిళను కారు ఢీకొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | In #Pimpri #Chinchwad #Pune, #Maharashtra, a woman was seriously injured after being hit by a speeding car, which threw her into the air. The incident occurred on June 12 at Swaraj Chowk within the MIDC Bhosari Police Station limits. The driver took the injured woman to… pic.twitter.com/ipPlrngjgt
— Pune Pulse (@pulse_pune) June 13, 2024