Man returns home after last rites | అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి
Man returns home after last rites | రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
భోపాల్: రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. (man returns home after last rites) మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.
కాగా, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్‌లో గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. జైపూర్‌లోని ఆసుపత్రికి వారు తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో రాజస్థాన్ పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత ఆ వ్యక్తి మృతదేహాన్ని సురేంద్ర కుటుంబానికి అప్పగించారు. మే 28న అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు 13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. అయితే ముందు రోజు సురేంద్ర నుంచి ఫోన్ వచ్చింది. నమ్మని సోదరుడు వీడియో కాల్ చేయాలని చెప్పాడు. అతడు వీడియో కాల్ చేయగా సురేంద్ర బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకుని షాక్ అయ్యారు. వెంటనే ఇంటికి తిరిగి రావాలని చెప్పారు. అలాగే 13 రోజున నిర్వహించాల్సిన కర్మకాండలను వాయిదా వేశారు.
కాగా, ఇంటికి తిరిగి వచ్చిన సురేంద్ర తన ఫోన్ పాడైందని తెలిపాడు. అందుకే రెండు నెలలుగా కుటుంబానికి ఫోన్ చేయలేదని చెప్పాడు. అయితే అతడు బతికే ఉన్నాడని రాజస్థాన్ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తప్పుగా గుర్తించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సురేంద్ర కుటుంబంపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- home
- Last rites
- Madhya Pradesh
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

