NEET Exam : నీట్ ప్రశ్నాపత్నం లీకేజ్‌తో పాటు పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని కర్నాటక మంత్రి ఈశ్వర ఖండ్రే డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై అత్యున్నత స్ధాయి విచారణకు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని అన్నారు.
నీట్ పరీక్షల నిర్వహణలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్రమాలకు బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కలబురగిలో మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంత్రి స్పందిస్తూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు.
Read More :
Online Games | ఆన్లైన్ గేమ్స్ మాయలో నేటితరం.. జీవితాలు నాశనం..!