Suicide attempt : ఏమైందో ఏమో ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నం చేసింది. ఇద్దరూ కలిసి గోమతి నదిలో దూకారు. అక్కడే ఉన్న మత్స్యకారులు చూసి ఆ ఇద్దరిని రక్షించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారుల చొరవతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
సుల్తాన్పూర్ ఏరియాలో గోమతి నదిలో చేపలు పడుతున్న మత్స్యకారులు అటుగా ఓ ప్రేమ జంట వచ్చి నదిలో దూకడం గమనించారు. పరుగున వెళ్లి మునిగిపోతున్న ఆ జంటలను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఓ మత్స్యకారుడు ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. చెంపలు వాచిపోయేలా కొట్టాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్రియుడికి బట్టతల ఉండటంతో ‘అమ్మాయి అంత అందంగా ఉంది.. ఈ ముసలోని ఎలా పడింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ముసలి ప్రియుడికి మరో నాలుగు తగిలించాల్సింది’ అని ఇంకో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు.
నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు
ఉత్తరప్రదేశ్ – సుల్తాన్పూర్లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు.
వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని… pic.twitter.com/NRqHDGaQoB
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2024