హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ స్కూళ్లలో అక్రమాలపై రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు అతిక్రమించి ఒకే స్కూలు బిల్డింగ్‌లో 2,4,8 స్కూళ్లు నిర్వహించడంపై నిరుడు ‘నర్సింగ్ స్కూళ్లలో అక్రమాలు!’, ‘అడ్డగోలు గా నర్సింగ్ స్కూళ్ల దందా!’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్ర చురించింది. దీంతో నిరుడు అక్టోబర్ 19న ప్రభుత్వం 14నర్సింగ్ స్కూళ్ల కు నోటీసులు జారీ చేసింది.
వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నది. నర్సింగ్ స్కూళ్లలో అక్రమాలపై మూడు వారాలైనా చర్యలు లేకపోవడంతో ‘నర్సింగ్ స్కూళ్లకు నోటీసులపై చర్యలేవీ?’ అనే మరో కథనాన్ని సైతం ప్రచురించింది. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన అ ధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కైన తీరును వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లోని 23 నర్సింగ్ స్కూళ్లపై గతంలో నర్సింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం 9 నర్సింగ్ స్కూళ్లకు ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున రూ.45 లక్షలు జరిమానా విధించిం ది.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌తో పొత్తు వల్ల సీపీఐకి ఒరిగిందేమీ లేదని, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు తీవ్రత రం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో ఆ పార్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేర కు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను తక్ష ణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ డిమాండ్ చే శారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు.