Sharwanand | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మనమే(Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న విషయ తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ కొత్త ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ను మీరు చూసేయండి. మరోవైపు ఈ సినిమా ఇప్పటివరకు రూ.16 కోట్లు వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.
పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రమ్ (శర్వానంద్) ఓ ప్లేబోయ్ లాంటి కుర్రాడు. తనకి ఎలాంటి బరువు, బాధ్యతలు లేవు. లండన్ లో హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. సుభద్ర (కృతిశెట్టి) విక్రమ్ క్యారెక్టర్ కి పూర్తిగా భిన్నమైన అమ్మాయి. చాలా బాధ్యతగా వుంటుంది. ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతుంది. ఇలాంటి భిన్న ధృవాలైన విక్రమ్, సుభద్ర అనుకోని పరిస్థిలుల్లో ఖుషి (విక్రమ్ ఆదిత్య) అనే ఓ చిన్ని పిల్లాడికి కేర్ టేకర్స్ గా ఉండాల్సివస్తుంది. తర్వాత ఏం జరిగింది? పిల్లాడిని చూసుకోవడంలో ఎలాంటి తిప్పలు పడ్డారు? అసలు పిల్లాడికి కేర్ టేకర్స్ ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? ఖుషి ఎవరు? విక్రమ్, సుభద్ర, ఖుషిలా ప్రయాణం చివరికి ఏ తీరాలకు చేరింది ? ఇవన్నీ తెరపై చూడాలి.