లక్నో: ఏనుగుతో రీల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించారు. భయపెట్టి దానిని తరిమేందుకు అతడు యత్నించాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. (Man Crushed To Death By Elephant) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అడవి నుంచి బయటపడిన ఒక ఏనుగు ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరించింది. గురువారం ఉదయం హబీబావాలా గ్రామానికి చేరింది.
కాగా, ఏనుగును చూసేందుకు గ్రామస్తులు గుమిగూడారు. బాగ్దాద్ అన్సార్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ముర్సాలీన్ ఆ ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. భయపెట్టి తరిమేందుకు దాని సమీపానికి వెళ్లాడు. ఆగ్రహించిన ఏనుగు అతడి వెంటపడింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. అయితే ముర్సాలీన్ను సమీపించిన ఏనుగు కాళ్లతో అతడ్ని తొక్కింది. తొండంతో 25 అడుగుల ఎత్తుకు విసిరికొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఏనుగు సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ముర్సాలీన్, రీల్ రికార్డు చేసే వ్యక్తి, ఇతరులు పరుగు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बिजनौर – रील बना रहे युवक को जंगली हाथी ने पटक कर मार डाला, हाथी हाईडिल कॉलोनी मे कई दिनों से मचा रहा उत्पात, शांत खड़े हाथी को भगाने गया था युवक, रील का वीडियो सोशल मीडिया पर वायरल , क्रोधित हाथी ने युवक को उतारा मौत के घाट, अफजलगढ़ क्षेत्र के हबीब वाला गांव की घटना.#Bijnor |… pic.twitter.com/BNaS5paXI1
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 13, 2024