Amul Ice Cream : సాధారణంగా బయటి ఆహార పదార్థాలను తీసుకోవద్దంటారు. ఎందుకంటే బయటి ఆహారాల తయారీకి నాసిరకం నూనెలు, పదార్థాలు వాడుతారని.. వాటి కారణంగా ఆనారోగ్యాలు దాపురిస్తాయని ఇలా చెబుతుంటారు. బయటి ఆహారాలతో ఇప్పుడు కల్తీ సమస్య మాత్రమే కాదు, శుభ్రత కూడా ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో పిన్నులు, సూదులు, క్రిములు, కీటకాలు బయటపడుతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఇటీవలే ముంబైకి చెందిన వైద్యురాలు కోన్ ఐస్‌క్రీమ్ బుక్ చేస్తే అందులో మనిషికి సంబంధించిన తెగిపోయిన వేలు దర్శనమిచ్చింది. దాంతో కంగుతినడం వైద్యురాలి వంతైంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నోయిడా సిటీలోని సెక్టార్-12 లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీపాదేవి అనే మహిళ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ బ్లింకిట్ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్ బుక్ చేయగా అందులో జెర్రి దర్శనమిచ్చింది. దాంతో షాకవడం ఆమె వంతైంది.
దీనిపై దీపాదేవి బ్లింకిట్‌కు కంప్లెయింట్ చేసింది. దాంతో దీపాదేవి చెల్లించిన రూ.195ను బ్లింకిట్ రీఫండ్ చేసింది. అదేవిధంగా విషయాన్ని అమూల్ ఐస్‌క్రీమ్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చింది. తన ఐదేండ్ల కుమారుడికి మ్యాంగో షేక్ చేసేందుకు అమూల్ ఐస్‌క్రీమ్‌ను ఓపెన్ చేయగా అందులో జెర్రి కనిపించిందని దీపాదేవి చెప్పారు. ఆ జెర్రి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రీ
ఉత్తరప్రదేశ్ – నోయిడాలో దీప అనే మహిళ తాను ఆన్లైన్లో బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్ ప్యాక్‌ను తెరిచినప్పుడు జెర్రీ వచ్చిందని తెలిపింది. pic.twitter.com/l1CBiiugqJ
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2024