Noida | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి నడి రోడ్లపై అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందులోని ఓ వ్యక్తి చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ప్రభుత్వ వాహనంపై నిల్చొని డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Viral Video).
సుమారు 10 నుంచి 15 మంది వ్యక్తులు నోయిడా (Noida) రోడ్డులో వీరంగం సృష్టించారు. ఓ చోట మూడు కార్లను ఆపి చొక్కాలు లేకుండా డ్యాన్సులు (Shirtless Men Dance ) చేశారు. అదే సమయంలో ‘భారత్ సర్కార్’ (Bharat Sarkar) అని రాసి ఉన్న వాహనంపై ఓ వ్యక్తి బీరు బాటిల్ చేతపట్టుకుని డ్యాన్స్ చేశాడు. అంతటితో ఆగకుండా బీరును కింద డ్యాన్స్ చేస్తున్న వారిపై వెదజిమ్ముతూ కనిపించాడు. వీరంతా ఏదో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. కారు బ్యానెట్‌పై ఓ కేకు కూడా కనిపించింది.
ఇందుకు సంబంధించిన వీడియోని ‘నోయిడా వీధుల్లో బహిరంగంగా మద్యం సేవించి గూండాయిజం చేస్తున్నారు. వాహనంపై భారత్ సర్కార్ అని కూడా రాసి ఉంది. ఈ వ్యక్తులు ఏ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారో..?’ అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించిన నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. వీడియోలోని వ్యక్తులను అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ తెలిపింది.
थाना फेस 1 के अंर्तगत नोएडा की सड़को में खुलेआम शराब पीकर हुरदंग मचाया जा रहा है.
गाड़ी पर भारत सरकार लिखा हुआ है इन लोगो से @noidapolice ये पूछिए ये कौन से सरकारी विभाग में है.
ऐसे लोग जिस भी पार्टी से होते है उसकी और सरकारी विभागों की छवि खराब करते है.@noidapolice उम्मीद… pic.twitter.com/AnOYNJ3Gkn
— आँचल यादव (राष्ट्र सर्वोपरि)🇮🇳 (@AnchalTv) June 13, 2024
Also Read..
NEET | నీట్ యూజీ అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్.. కేంద్రం, ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
Radhika Merchant | అంబానీ కోడలా మజాకానా.. రాధికా మర్చంట్ క్రూయిజ్ పార్టీ లుక్స్ చూశారా..?
Kuwait Fire | కువైట్ అగ్నిప్రమాద మృతులకు కేరళ సీఎం నివాళి.. కొచ్చి విమానాశ్రయంలో మిన్నంటిన రోదనలు